హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 99పై స్టే విధించాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరుగగా హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజులు ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులుగా హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

Post a Comment

أحدث أقدم