సికింద్రాబాద్- గోవా ట్రైన్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్- వాస్కోడగామా (గోవా) మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ రైలు ప్రారంభంతో తెలుగు ప్రజలకు గోవా ప్రయాణం సులభంగా మారుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుందని అధికారులు చెప్పారు. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్​కు గురు, శనివారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. ఈ రైలుకు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్​నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్‌రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్- గోవా ట్రైన్‌లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్​లు అందుబాటులో ఉన్నాయి. 

Post a Comment

أحدث أقدم