తెలంగాణలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో దసరా రోజు కుమారులిద్దరినీ వ్యవసాయ బావిలోకి తోసి, ఆపై తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయగావ్‌కు చెందిన శ్రీనివా్‌సరెడ్డి (36) 12 ఏళ్ల క్రితం నందివాడకు చెందిన చిట్టెపు గుండారెడ్డి, సుగుణవ్వల కుమార్తె అపర్ణను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. భార్యతో పాటు అత్తా మామలతో కలిసి నందివాడలోనే ఉంటున్నాడు. కొన్ని రోజులుగా శ్రీనివా్‌సరెడ్డికి భార్య, అత్తమామలతో విభేదాలు వచ్చాయి. 'నువ్వు ఇల్లరికం వచ్చావ్' అంటూ అత్త మామ, భార్య పెత్తనం పెరగడం ఆయనను మరింత మనస్తాపానికి గురి చేసింది. దీంతో ఆరు నెలల నుంచి శ్రీనివా్‌సరెడ్డి వేరుగా ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్, జూదానికి అలవాటు పడిన శ్రీనివా్‌సరెడ్డి రూ.లక్ష వరకు అప్పు చేసినట్లు తెలిసింది. ఇలా కుటుంబకలహాలు, అప్పులు పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. శనివారం రాత్రి దసరా సందర్భంగా బంధువులకు జమ్మి పెడతానని కుమారులు విగ్నేశ్ రెడ్డి(4), అనిరుధ్ రెడ్డి(6)లను తీసుకెళ్లాడు. వ్యవసాయ భూమి పక్కన ఉన్న బావిలో ఇద్దరు పిల్లలను తోసి, ఆపై తాను కూడా దూకాడు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురి మృతదేహాలు బయపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకులను బావిలో తోసి, బలవన్మరణానికి పాల్పడిన తండ్రి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق