ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు మంత్రులను రెండేసి జిల్లాలకు ఇన్ఛార్జీగా నియమించింది. అచ్చెన్నాయుడుకు మన్యం, కోనసీమ జిల్లాల ఇన్ఛార్జీ బాధ్యతల అప్పగించారు. నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగానికి సత్యసాయి, తిరిపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్, లోకేష్ లకు ఇన్ఛార్జీ బాధ్యతలు ఇవ్వకపోడంతో నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతల అప్పగించారు. జనసేన మంత్రులకు ఏలూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలను అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకం !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق