సినీ నటీ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా తాను నివసిస్తున్న బిల్డింగ్ ఆరో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం బాలీవుడ్ మీడియా ద్వారా బయటికొచ్చింది. దీంతో వెంటనే బాంద్రా పోలీస్‌తో పాటు క్రైమ్ బ్రాంచ్ టీమ్ కూడా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు పోలీసులకు సూసైడ్ నోట్ లాంటిది ఏమీ లభించలేదు. అంతే కాకుండా అసలు అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలు కూడా బయటికి రాలేదు. మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా, తల్లి జాయ్స్ పాలికార్ప్.. తన చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం మలైకా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన చిన్నతనం గురించి స్వయంగా బయటపెట్టింది. తను చిన్నతనంలో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండేదాన్ని అని, కానీ తల్లిదండ్రుల విడాకుల తర్వాత అంతా మారిపోయిందని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తన వయసు కేవలం 11 ఏళ్లే అని, తన చెల్లి అమృత వయసు ఆరేళ్లు అని గుర్తుచేసుకుంది. తల్లిదండ్రుల విడాకుల తర్వాత మలైకాతో పాటు తన చెల్లి అమృత కూడా తల్లి జాయ్స్‌తో కలిసి ఉండడం మొదలుపెట్టారు.
إرسال تعليق