టాటా గ్రూప్ కంపెనీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ దేశం వెలుపల కాసాబ్లాంకాలో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఫ్యాక్టరీ విదేశీ గడ్డపై మొట్ట మొదటి స్వదేశీ రక్షణ కర్మాగారం అవుతుంది. ఈ ఫ్యాక్టరీ ప్రారంభంలో ఈ కర్మాగారం రాయల్ మొరాకన్ సాయుధ దళాల కోసం ప్రత్యేకమైన వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్‌ఫారమ్‌లను తయారు చేస్తుంది. తరువాత ఈ కర్మాగారం మొత్తం ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులను తయారు చేస్తుంది. టాటా గ్రూప్‌కు చెందిన ఈ కర్మాగారంలో మొదట్లో ప్రతి సంవత్సరం 100 సాయుధ వాహనాలు ఉత్పత్తి చేయనున్నారు. ఏడాదిలోగా ఈ ఫ్యాక్టరీ సిద్ధమై అప్పుడు ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి మొదటి వాహనం 18 నెలల్లో రెడీ అయ్యి రిలీజ్ అవుతుంది అని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. వాస్తవానికి టాటా గ్రూప్‌కు చెందిన ఈ వాహనాలు ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత సైన్యం ఉపయోగిస్తోంది. పరిమిత సంఖ్యలో తయారు చేస్తోన్న ఈ యుద్ధ వాహనాలు భారతదేశంలోని లడఖ్ సరిహద్దులో మోహరించబడ్డాయి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సహకారంతో వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్‌ఫారమ్‌ని అభివృద్ధి చేసింది. మొరాకో సైన్యం ఎంపిక చేయడానికి ముందు ఈ వాహనం ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాల్లో అనేక రౌండ్ల పరీక్షలు జరిపించారు. ఆ తర్వాతే టాటా గ్రూప్‌కు ఈ కాంట్రాక్టు లభించింది. ఈ ఫ్యాక్టరీలో దాదాపు 350 మందికి ఉపాధి లభించనుంది. భారత దేశంలో ఈ వాహనాల ఉత్పత్తికి సంబంధించి చాలా పనులు జరగనున్నాయి. ఈ ఫ్యాక్టరీతో టాటా గ్రూప్ ఆఫ్రికా డిఫెన్స్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించనుంది.

Post a Comment

أحدث أقدم