సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలే అడ్మిట్ చేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయితే 72 ఏళ్ల సీతారాం ఏచూరి కొద్దిగా కోలుకున్నారని భావించిన సమయంలోనే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డాక్టర్లు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరుగా సీతారాం ఏచూరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వామపక్ష పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన సుమారు నాలుగైదు దశాబ్ధాలకుపైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరడంతో ఆసుపత్రిలో చేరారు.

Post a Comment

أحدث أقدم