తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా నియామక పత్రం అందుకుంది. ఆమెకు మూడేళ్ల పాటు ప్రొబెషనరీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. గత నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో సెక్షన్ 4లోని తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు సవరణ చేసి నిఖత్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. నిజామాబాదు కు చెందిన నిఖత్ జరీన్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. దాంతో ఒలంపిక్స్ 2024 లో ఆమెపై మెడల్ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సెమీ ఫైనల్స్ కూడా చేరకుండా నిఖత్ జరీన్ చైనీస్ సీడెడ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. దాంతో అభిమానులు నిరాశ చెందిన నిఖత్ జరీన్ సాధించిన విజయాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఈ డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది.
బాక్సర్ నిఖత్ జరీన్‌కి డీఎస్పీగా నియామక పత్రం అందజేత !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق