హైదరాబాద్ శివారులోని మక్త గ్రామంలో పాల వ్యాపారి ఇంట్లో రూ.2.02 కోట్ల చోరీ కేసులో మిస్టరీ వీడింది. పాల వ్యాపారి వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న రవి నేతృత్వంలో ఆరుగురు ఈ చోరీ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాపారి తన ఇంట్లో రూ.15 లక్షలు చోరీ అయ్యాయని ఫిర్యాదు ఇవ్వగా చోరీ చేసిన వారు మాత్రం సంచిలో రూ.2.02 కోట్లు ఉన్నాయని పోలీసులకు చెప్పడం విడ్డూరం. పోచారం ఠాణా పరిధి మక్త గ్రామానికి చెందిన పాల వ్యాపారి నాగభూషణం (70) ఈ నెల 22న ఉదయం తన ఇంట్లో భారీ చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మొత్తం రూ.2.02 కోట్ల నగదు, 28 తులాల నగలు ఎత్తుకెళ్లినట్లు చెప్పాడు. అయినా తొలిరోజు ఫిర్యాదు ఇవ్వలేదు. అదుపులోకి తీసుకుని విచారించాక మరుసటి రోజు ఠాణాకు వెళ్లి రూ.15లక్షలు పోయినట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో సీసీ కెమెరాలను తనిఖీ చేయగా ఓ ఆటోలో ముగ్గురు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. దాని ఆధారంగా సుమారు 200 పైగా సీసీ కెమెరాలను పరిశీలించి ఆటో నెంబరు ద్వారా పవన్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని నాగభూషణం డ్రైవర్‌ రవి స్నేహితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. నాగభూషణం వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు రవి చెప్పాడని, అతడి సూచన మేరకే చోరీ చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. నాగభూషణం ఇంట్లో లేని సమయం గుర్తించి రవి సమాచారం ఇవ్వగా ఆటోడ్రైవర్‌ మహేశ్‌తో కలిసి చోరీ చేశామని చెప్పినట్లు సమాచారం. వీరికి మరో నలుగురు సహకరించినట్లు గుర్తించి అందర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగభూషణం రూ.15 లక్షలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరు చోరీ చేసిన సంచిలో దాదాపు రూ.2 కోట్లు ఉన్నాయని, మరో నిందితుడు రూ.1.7 కోట్లు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. 

Post a Comment

أحدث أقدم