23 ఏళ్ల విద్యార్థి 'తపాలా నాదముని' బాల్‌పాయింట్ పెన్‌ భాగాలను ఉపయోగించి ఒక వాల్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది. చిన్నప్పటి నుంచే గాడ్జెట్‌లను తయారు చేయడం పట్ల అభిరుచి కలిగిన నాదముని 2020లో 0.69 ఇంచెస్ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ రూపొందించారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దానికంటే 0.07 ఇంచెస్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. దీనిని తయారు చేయడానికి 8 నెలల సమయం రూ. 20000 డబ్బు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ చిన్న వ్యాక్యూమ్‌ క్లీనర్‌లో రివాల్వింగ్ ఫ్యాన్, ఫోర్-వోల్ట్ వైబ్రేషన్ మోటారును ఉపయోగించారు. ఇది సులభంగా దుమ్ము కణాలను సేకరిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్‌ తయారీకి కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బిట్స్, మెటల్ కూడా ఉపయోగించినట్లు నాదముని పేర్కొన్నారు. నాదముని రూపొందించిన ఈ చిన్న ఆవిష్కరణలే అతన్ని సూక్ష్మ ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామిగా నిలిపాయని పేర్కొన్నారు. దీనిని చూసి కాలేజీలోని విద్యార్థులందరూ ఆశ్చర్యపోతున్నారని, అధ్యాపకులు అభినందిస్తున్నారని నాదముని వెల్లడించారు.

Post a Comment

أحدث أقدم