పోకో ఎక్స్ 6 నియో 5జీ స్మార్ట్ ఫోన్ తగ్గింపు ఆఫర్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 12,999 ధరకే అందుకునే అద్భుతమైన అవకాశం అందుబాటులో వుంది. ఈ ఫోన్ 108MP కెమెరా సిస్టం, అద్భుతమైన స్క్రీన్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో భారీగా పెరిగిన కాంపిటీషన్ తో ప్రైస్ కట్ అందుకుని ఈ ఫోన్ మరింత చవక ధరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు రూ. 2,000 తగ్గింపు అందుకొని రూ. 13,999 రూపాయల తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 12GB + 256GB వేరియంట్ కూడా రూ. 15,199 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ లను HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారు రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 


Post a Comment

أحدث أقدم