సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా కుమార్తెల కోసం అకౌంట్ ఓపెన్ చేయాలంటే వారి తల్లిదండ్రులు గానీ, సంరక్షకులు గానీ అవసరం. కుమార్తెకు తల్లిదండ్రులు చట్టపరమైన సంరక్షలు. కానీ, కుమార్తెకు చట్టపరమైన సంరక్షకులు లేకుంటే ఇతర సంరక్షకులు ఆమె పేరిట ఖాతా తెరిచే అవకాశం ఇంతకు ముందు ఉంది. కానీ, ఇప్పటి నుంచి అలా కుదరదు. బాలిక పేరిట ఉన్న ఖాతాను చట్టపరమైన సంరక్షకుడి పేరిట బదిలీ చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు ఖాతాను మూసివేయడం జరుగుతుంది. కాగా అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ ఖాతాలో సంవత్సరానికి రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒక వ్యక్తి Sukanya Samriddhi Yojana ఖాతాలో 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఏటా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేస్తే, 15 సంవత్సరాలకు అతడు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 22,50,000 అవుతుంది. ఈ స్కీమ్‌లో మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు. 15 సంవత్సరాల తర్వాత డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి 21 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. 21 సంవత్సరాలు ముగిసిన తరువాత ఆ వ్యక్తికి వడ్డీతో కలుపుకుని రూ. 69,32,638 అందుతాయి. అంటే, తన డిపాజిట్ పై ఆ వ్యక్తికి రూ. 46,82,638 ల వడ్డీ లభిస్తుంది.
అక్టోబర్ 1 నుంచి సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌లో కొత్త నిబంధనలు ?
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق