మిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ఇటీవల ఇచ్చి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తమిళ హీరో విజయ్‌ సేతుపతి. కేవలం హీరోగానే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా సైడ్‌ క్యారెక్టర్‌లో కూడా కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్‌ బాబు నటించిన 'అతడు' సినిమాను పదే పదే చూశానని చెప్పుకొచ్చారు. తాను కష్టాల్లో ఉండే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మహేశ్‌ బాబు నటించిన అతడు చిత్రాన్ని చాలాసార్లు చూశానని తెలిపారు. ఆ సినిమాలో మహేష్‌ ఎంట్రీ నుంచి క్లైమాక్స్‌ వరకూ ప్రతి సన్నివేశం తనకు గుర్తుందని అన్నారు. ఇక అతడులో అన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయని, ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారాని చెప్పుకొచ్చారు. మహేశ్‌ - త్రిషల మధ్య రొమాన్స్‌ కూడా నాకు నచ్చిందని, బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు, పాటలు అన్నీ నాకు ఇష్టం అని చెప్పుకొచ్చారు. 

Post a Comment

أحدث أقدم