తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్తమద్దిపడిగకు చెందిన దుర్గం రాజలింగు, సుశీల దంపతుల కుమార్తె ఆరాద్య (18 నెలలు) గురువారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ స్విచ్ బోర్డుకు ఉన్న సెల్ ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకుని విద్యుత్ షాక్ కు గురైంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అప్పటివరకూ తమతో ఆడుకున్న చిన్నారి ఇక లేదని తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని విద్యుత్ షాక్కు గురై చిన్నారి మృతి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق