గుజరాత్‌లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొత్తం అతలాకుతలమవుతోంది. అనేక ప్రాంతాలను వరద ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వడోదరలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని విశ్వమిత్ర నదికి వరద పోటెత్తింది. నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. ఈ వరదల్లో భారత మహిళా క్రికెటర్, స్పిన్నర్ రాధా యాదవ్ కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ విషయాన్ని క్రికెటరే స్వయంగా ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సహాయక బృందాలకు ఆమె కృతజ్ఞతలకు తెలిపారు.
إرسال تعليق