కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధర పెరిగింది. గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నేటి నుండి దేశంలోని వివిధ నగరాల్లో ఎల్‌పిజి సిలిండర్ల ధర సుమారు రూ.8-9 పెరిగింది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.6.50 పెరిగి రూ.1652.50కి చేరుకుంది. అంతకుముందు జులై నెలలో రూ.19 తగ్గి రూ.1,646కు చేరింది. అదేవిధంగా నేటి నుంచి కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లు రూ.1,764.50కి అందుబాటులోకి రానున్నాయి. కోల్ కతాలో రూ.8.50 పెరిగింది. ఈ పెద్ద సిలిండర్ కోసం ముంబై ప్రజలు ఇప్పుడు రూ. 1,605 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో దీని ధర ఇప్పుడు రూ. 1,817 అవుతుంది. అంతకుముందు 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర వరుసగా నాలుగు నెలల పాటు తగ్గింది. గత నెల అంటే జులై 1 నుంచి 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర సుమారు రూ.30 తగ్గింది. జూన్‌లో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.19 తగ్గింది. మే 1 నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.19 తగ్గింది. ఏప్రిల్‌కు ముందు వరుసగా మూడు నెలలపాటు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి.
إرسال تعليق