న్యూ ఢిల్లీలో ఆస్తి విషయంలో ఓ బాలికతో వాగ్వాదానికి దిగిన బిల్డర్ దాడికి దిగాడు. దీంతో ఆమె నిర్మాణంలో ఉన్న భవనం నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని కిరారీ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆస్తి విషయంపై బిల్డర్‌తో మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో అతడు బాలికపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె నిర్మాణంలో ఉన్న భవనం నుంచి కిందకు పడిపోయింది. ఆరడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు అతడిని కనీసం అడ్డుకోకుండా చూస్తూ నిలబడిపోయారు. దాడి అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్తి తగాదాలో బాలికపై బిల్డర్ దాడి : వీడియో నెట్టింట వైరల్
السبت، 27 يوليو 2024
national New Delhi ఆస్తి తగాదాలో బాలికపై బిల్డర్ దాడి తీవ్ర గాయాలయ్యాయి నిర్మాణంలో ఉన్న భవనం నుంచి కింద పడిపోయింది వీడియో నెట్టింట వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق