రాహుల్ గాంధీ ప్రసంగాన్ని వక్రీకరించి, తప్పుదారి పట్టించిన తీరు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగం చేసినట్టు ఉందని, పార్లమెంట్‌లో మాట్లాడిన తరహాలో లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆరోపణలు చేశారని, కానీ వాటిని తిప్పికొట్టేందుకు మల్లికార్జున్‌ ఖర్గే లేచి నిలుచున్నా ఆయనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రధాని పార్లమెంట్‌ వేదికగా అసత్యాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మెజారిటీ రాకపోయినా ఆయనకూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాలేదనే విషయం ప్రధాని అర్ధం చేసుకోవాలని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు మోడీకి వ్యక్తిగతంగా, నైతికంగా, రాజకీయంగా నష్టం చేకూర్చాయనే విషయం ఆయన గుర్తెరగాలని చెప్పారు. ప్రధాని మోడీ మూడింట ఓ వంతు ప్రధాని అని తాను అంటే ఆయన దాన్ని కూడా వక్రీకరించి తాను మూడింట ఓ వంతు ప్రభుత్వమని అన్నట్టు ప్రచారం చేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు, నితీష్‌ లేకుంటే మోడీ ప్రధాని కాలేరని పేర్కొన్నారు. మోడీ 240 దగ్గరే ఆగిపోయారు. ఆయనకు అనుకూలంగా ప్రజా తీర్పు రాలేదని వివరించారు. ఆయన మూడోసారి ప్రధాని కావడం వాస్తవమే అయినా ఆయనకు మెజారిటీ మాత్రం దక్కలేదని జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు.

Post a Comment

أحدث أقدم