సోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన కుంభవృష్టి వర్షాలకు అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నీరంతా సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 90కి పెరిగింది. అస్సాం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకారం.. సుమారు 24 జిల్లాల్లోని 12.33 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ 2 వేల 406 గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.

Post a Comment

أحدث أقدم