ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీని రూపొందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందనీ, కానీ వారి స్మార్ట్ సిటీలో ఎక్కడచూసినా జలమయమైన రోడ్లు, చెత్తచెదారం పేరుకుపోయిన వీధులే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ హయాంలో ఎటుచూసినా ప్రమాదాలే జరుగుతున్నాయని, ప్రజల వాహనాలు లోయల్లో పడిపోతున్నాయని అన్నారు. ఆరోగ్య సేవలు, ఆస్పత్రులు, ప్రాధమిక సౌకర్యాలు లేక పడకేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. హథ్రాస్ లో జరిగిన ఘటన కూడా అధికారుల వైఫల్యం కారణంగానే జరిగిందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, యువత ఉద్యోగాల కోసం వీధుల చుట్టూ తిరుగుతున్నారని అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ పాలనలో విపరీతంగా పెరిగిన నిరుద్యోగం : అఖిలేష్ యాదవ్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق