గుజరాత్‌కు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ చేసిన ప్రత్యేక సైకిళ్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఆకర్షించాయి. రిటైర్డ్ ఇంజనీర్ సుధీర్ భావే ప్రత్యేకమైన సైకిల్ డిజైన్‌లు అభివృద్ధి చేస్తుంటారు. ఆయన గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్ర ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అలాగే, ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇవాళ తన ఇన్‌బాక్స్‌లో సుధీర్ భావే స్టోరీ కనపడిందని, ఆయన సృజనాత్మకతకు సలాం అని చెప్పారు. దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు మూలం యువత మాత్రమే కాదన్న విషయాన్ని సుధీర్ నిరూపించారని తెలిపారు. వడోదరలోని తమ వర్క్‌షాప్‌ని సుధీర్ ప్రయోగాల కోసం వాడుకోవాలనుకుంటే తనకు తెలియజేయాలని, ఆ అవకాశం కల్పిస్తానని చెప్పారు. సుధీర్ రిటైర్డ్ కాలేదని, ఆయన తన జీవితంలోనే అత్యంత ప్రతిభను చాటే కాలాన్ని గడుపుతున్నారని తెలిపారు. కాగా, ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోలో సుధీర్ భావే వినూత్నమైన డిజైన్‌లతో సైకిల్‌లను రూపొందించినట్లు కనపడుతోంది.
రిటైర్డ్ ఇంజనీర్ చేసిన సైకిళ్లపై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు !
السبت، 20 يوليو 2024
gujarat national ప్రత్యేకమైన సైకిల్ డిజైన్‌లు అభివృద్ధి చేస్తుంటారు రిటైర్డ్ ఇంజనీర్ చేసిన సైకిళ్లపై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు రిటైర్డ్ ఇంజనీర్ సుధీర్ భావే
ليست هناك تعليقات:
إرسال تعليق