మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పూణెలో ఇద్దరు గర్భిణీలు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. జికా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి. వారికి నిరంతరం పరీక్షలు నిర్వహించాలి. ఈ వైరస్ పాజిటివ్గా పరీక్షించిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించాలి. వారిపట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. అలాగే ఈ వైరస్కు గురైన బాధిత గర్భిణీ స్త్రీ పిండంలో జికా మైక్రోసెఫాలీ నాడీ సంబంధిత పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నందున, పర్యవేక్షణ కోసం వైద్యులను అప్రమత్తం చేయాలని కేంద్రం సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు,ఆరోగ్య సౌకరాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ వైరస్ పట్ల ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి సోషల్ మీడియా, ఇతర ఫ్లాట్ఫారమ్లలో ముందు జాగ్రత్తగా సందేశాలు పంపి అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కోరింది.
إرسال تعليق