వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియన్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. దీంతో ఆ టోర్నీ వేదికను మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా శ్రీలంకలో ఆ టోర్నీని నిర్వహించనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చాలని ఐసీసీని బీసీసీఐ కోరనున్నట్లు కొన్ని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు వచ్చే ఏడాది పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. 8 జట్లతో కూడిన టోర్నీ షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు త్వరలో ఖరారు చేయనున్నది. లాహోర్‌లో ఏడు మ్యాచ్‌లు, రావల్పిండిలో అయిదు, కరాచీలో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు పీసీబీ ప్లాన్ వేసింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజీ మ్యాచ్‌ను మార్చి ఒకటో తేదీన లాహోర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ పాకిస్థాన్ వెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో చివరిసారి 2008లో భారత్ టూర్ చేసింది. గడిచిన 16 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాయి. 2012-13లో చివరిసారి ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరిగింది. నిజానికి గత ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సి ఉన్న ఆసియాకప్‌లో ఆడేందుకు ఇండియా వెళ్లేందుకు సిద్దమైంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఆ టోర్నీని పాకిస్థాన్ నుంచి మార్చేశారు. శ్రీలంకలో ఆ టోర్నీ నిర్వహించారు.
దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ?
الخميس، 11 يوليو 2024
cricket sports ఇండియన్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ వర్గాల ద్వారా వెల్లడి దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ? ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు
ليست هناك تعليقات:
إرسال تعليق