అనంత్‌ అంబానీ వాచ్‌ ఖరీదు 6.91 కోట్లు ?

ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహం ఈ నెల 12న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఇంట జరిగే చివరి వివాహం కావడంతో అత్యంత విలాసవంతంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. ఆ ఈవెంట్‌లో ఆ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి కూడా. తాజాగా అలానే అనంత్‌ ధరించిన లగ్జరియస్‌ వాచ్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. రాధిక మర్చంతో వివాహ నేపథ్యంలో అనంత్‌ ప్రముఖ దేవాలయాలను దర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోని నేరల్‌లోని కృష్ణ కాళీ దేవాలయాన్ని దర్శించారు కాబోయే వరుడు అనంత్‌ అంబానీ. అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఆలయంలో హవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ ధరించిన గడియారం అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. అనంత్ అంబానీకి అద్భుతమైన వాచీలను సేకరించే అలవాటు ఉంది. వాటిలో ఖరీదైన పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే నుండి అరుదైన వాచీలు ఉన్నాయి. కృష్ణ కాళీ ఆలయ సందర్శన సమయంలో, అనంత్ రిచర్డ్ మిల్లే వాచీని పెట్టుకున్నారు. ఎరుపు రంగు కార్బన్ రిచర్డ్ మిల్లే వాచ్ (ఆర్ఎం 12-01 టూర్బిల్లాన్)ను ఆయన పెట్టుకున్నారు. దీని ధర ఏకంగా రూ. 6.91 కోట్లు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాచ్‌లు చాలా పరిమితి పరిధిలోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు ఈ బ్రాండ్‌కు సంబంధించినవి 18 వాచ్‌లు మాత్రమే రూపొందించారు. 

إرسال تعليق

أحدث أقدم
3