తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. అయితే, ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో ధరల పెంపునకు సిద్దమవుతోంది ప్రభుత్వం. అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు కొంత అదనపు ఆదాయం అవసరమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం మద్యం ధర పెంచితే ఆ అదనపు ఆదాయం రానుంది.
إرسال تعليق