డిగ్రీలో ఫెయిల్ అయ్యాడని కొడుకుని మందలించిన తల్లితో పాటు తమ్ముడి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం తమిళనాడులోని తిరువొట్రియూర్ లో ఇటీవల విడుదలైన డిగ్రీ ఫలితాలల్లో నిందితుడు సతీష్ ఫెయిల్ అయ్యాడు. దీంతో తల్లి అతన్ని మందలించింది. ఈ విషయంలో తల్లిపై పగ పెంచుకున్న సతీష్ శనివారం రాత్రి తల్లితో పాటు, తమ్ముడిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. అనంతరం హత్యకు సంబంధించిన ఫోటోలను తీసి తన అక్కకు వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలు చూసి షాక్ తిన్న మహిళ వెంటనే పక్కింటి వారితో పాటు పోలీసులకు సమాచారం అందించింది. పక్కింటి వారు ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి కొడుకు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుడు సతీష్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

Post a Comment

أحدث أقدم