దేశ వాణిజ్య రాజధాని ముంబైని వర్షాలు పలకరించాయి. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరైన ముంబై వాసులకు కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు రిలీఫ్ ఇచ్చాయి. తుఫాన్ హెచ్చరికలతో అరేబియా సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలోని మెరైన్ డ్రైవ్ బీచ్‌లో అలలు ఎగిసిపడుతుండటంతో స్ధానికులతో పాటు పెద్దసంఖ్యలో పర్యాటకులు బీచ్ ప్రాంతానికి చేరుకుని సేద తీరుతున్నారు. బీచ్ అందాలను ఆస్వాదిస్తూనే అలల అలజడిని వీక్షించారు. సెలవుదినం కావడంతో పెద్దసంఖ్యలో టూరిస్టులు, నగరవాసులు సిటీలోని బీచ్‌లకు పోటెత్తారు.
إرسال تعليق