గూగుల్ క్రోమ్ లో 'లిజన్ టు దిస్ పేజ్' సరికొత్త ఫీచర్ వచ్చింది. తొలుత ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు. టెక్ట్స్‌ను కష్టపడి చదవకుండా ఈజీగా వినేయొచ్చు. ప్రస్తుతానికి ఈ అద్భుత ఫీచర్ కొందరికే అందుబాటులోకి వచ్చింది. విడతలవారీగా గూగుల్ క్రోమ్ వాడే ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది. 'లిజన్ టు దిస్ పేజ్' ఫీచర్‌ను వాడాలంటే వెబ్ పేజీని ఓపెన్ చేసి, పైన కుడివైపు ఉండే త్రీడాట్స్ మెనూ ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే 'లిజన్ టు దిస్ పేజ్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పాడ్‌కాస్ట్‌లాగా వాయిస్ ప్రారంభం అవుతుంది. మ్యూజిక్ ప్లేయర్ తరహాలో దీన్ని మీరు పాజ్, రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వేగంగా వినాలనుకుంటే, ప్లే బ్యాక్ స్పీడ్‌ను కూడా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్‌లో రూబీ, రివర్, ఫీల్డ్, మోస్ అనే నాలుగు రకాల వాయిస్ టైప్స్ ఉన్నాయి. ఇందులో మనకు నచ్చిన దాన్ని ఎంచుకొని హాయిగా ఆడియో ఫార్మాట్‌లో వినొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం 12 భాషలకు సపోర్ట్ చేస్తోంది. హిందీ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇండోనేసియన్, జపనీస్, పోర్చ్‌గీస్, రష్యన్, స్పానిష్ భాషలు ఉన్నాయి. ఆండ్రాయడ్ డివైజ్‌కు స్క్రీన్ లాక్ చేసి ఉన్నా ఈ ఫీచర్ ద్వారా టెక్ట్సు ఆడియోను మనం వినొచ్చు. ఒక వెబ్ పేజీలో ఆడియోను వింటూనే మరో వెబ్ పేజీని మనం యాక్సెస్ చేయొచ్చు.
గూగుల్ క్రోమ్ లో 'లిజన్ టు దిస్ పేజ్' ఫీచర్ !
الثلاثاء، 18 يونيو 2024
google science technology గూగుల్ క్రోమ్ లో 'లిజన్ టు దిస్ పేజ్' ఫీచర్ విడతలవారీగా గూగుల్ క్రోమ్ వాడే ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ
ليست هناك تعليقات:
إرسال تعليق