మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో కదులుతున్న ట్రక్కు నుంచి సామాన్లు తస్కరించి.. ఆపై సినీ ఫిక్కీలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆగ్రా- ముంబయి జాతీయ రహదారిపై వెళుతున్న ఓ ట్రక్కు పై నుంచి ఇద్దరు వ్యక్తులు ఓ మూటను తొలుత రహదారిపై జారవేయడం వీడియోలో కనిపించింది. ఆపై ఆ వెనుకే ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి రాగా వారిద్దరూ కదులుతున్న వాహనం నుంచే ప్రమాదకరంగా బైక్‌పై దిగడం గగుర్పాటుకు గురిచేస్తోంది. అటుగా వెళుతున్న వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. 'ధూమ్' మూవీలో చూపించిన దోపిడీ సీన్లూ దిగదుడుపే అంటూ కామెంట్లు పెడుతున్నారు. కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ.. ఇవేం ఫీట్లు బాబోయ్..!
కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ ?
السبت، 25 مايو 2024
national కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ ? తస్కరించి.. ఆపై సినీ ఫిక్కీలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పరారయ్యారు మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో వీడియో సోషల్ మీడియాలో వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق