బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్‌ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని భావిస్తున్నట్టు నటుడు నవదీప్‌ అన్నారు. 'ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్‌ న్యూస్‌లో కనిపించడంలేదు' అంటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. తన కొత్త సినిమా 'లవ్‌ మౌళి' ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో రేవ్‌ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. 'చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు' అంటూ విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. రేవ్‌ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.

Post a Comment

أحدث أقدم