ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ తాను జైలులో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన భార్య సునీతా కేజ్రీవాల్‌ని ప్రశంసించారు. ''ఝాన్సీ కి రాణి'' అంటూ అభివర్ణించారు. ''ఈ రోజు నా భార్య వెంట ఉంది, నేను లేనప్పుడు ఆమె అన్నీ చూసుకుంది, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చేది. ఆమె ద్వారా నా ఢిల్లీ వాసుల యోగక్షేమాలు తెలుసునేవాడిని, ఆమె నా సందేశాలు తీసుకువచ్చేది. ఆమె ఝాన్సీకి రాణి లాంటిది'' అంటూ తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. మీ ఆశీర్వాదం వల్లే నా భర్త ఈ రోజు మాతో ఉన్నారు, మంచి పనిచేసేవారికి దేవుడు సాయం చేస్తాడని, నా భార్య జైలుకు వెళ్లకూడదనుకుంటే మే 25న ఆప్‌కి ఓటేయండి అంటూ ప్రజల్ని కోరారు. తాను అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తానని కేజ్రీవాల్ మరోసారి హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడదని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం కారణంగా దేశం మొత్తం బీజేపీపై కోపంతో ఉన్నారని చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంట్ స్థానాలకు జూన్ 25న ఆరో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.
إرسال تعليق