షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. కాగా నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడుకు.. మరో 15మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని, కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15మంది పేర్కొంటున్నారు. అయితే ఆ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని పోలీసులకు 15మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ భూముల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మల్లారెడ్డి బాధితులు సమావేశం నిర్వహించారు. మరోసారి మల్లారెడ్డిపై బాధితులు సంచలన ఆరోపణలు చేశారు.
ఎఫ్టీఎల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారులు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق