కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన 45 గంటల ధ్యానంపై కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కెమెరాల ముందు పబ్లిసిటీ కోసం ధ్యానం చేస్తున్నట్లు ఉందని ఆయన ట్వీట్ చేశారు. దీనికి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో మోడీ చేస్తోంది 'మెడిటేషన్ కాదు.. ఎడిటేషన్' అంటూ ఓ సెటైరికల్ ఫొటోను జోడించారు. ఇది అన్నింటినీ వివరిస్తుంది! అనే క్యాప్షన్ తో కాంగ్రెస్ నేత చేసిన ఈ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
إرسال تعليق