కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) మూడోసారి టైటిల్‌ను గెలుచుకోవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 ఆదివారం ముగిసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కెకెఆర్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. హాట్ ఫేవరేట్ గా భావించిన సన్ రైజ్ హైదరాబాద్ చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సీజన్ మొదటి అర్ధభాగంలో అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించారు. కానీ, ఆదివారం మ్యాచ్ లో చేతులెత్తేశారు. దీంతో సన్ రైజ్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కమ్మిన్స్ చేసిన 24 పరుగులే టాప్ స్కోర్. హైదరాబాద్ ఇచ్చిన 114 పరుగుల లక్ష్యాన్ని వెంకటేష్ అయ్యర్ (52*), రహ్మానుల్లా గుర్బాజ్ (39) ఆడుతూ పాడుతూ చేధించేశారు. సగం ఓవర్లు మిగిలి ఉండగానే KKRని విజేతగా నిలిపారు. పదేళ్ల తరువాత కోల్‌కతాకు ఐపీఎల్ ట్రోఫీని అందించారు.
ఐపీఎల్ 2024 విజేయత కోల్కతానైట్ రైడర్స్ !
الاثنين، 27 مايو 2024
cricket national sports ఐపీఎల్ 2024 విజేయత కోల్కతానైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై
ليست هناك تعليقات:
إرسال تعليق