ప్రముఖ టెక్ కంపెనీ కాగ్నిషన్ ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 'డెవిన్' టూల్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఏఐ టూల్ హ్యుమన్ ఇంజనీర్‌లతో కలిసి పనిచేయడానికి కంపెనీ రూపొందించింది. కేవలం సింగిల్ ప్రాంప్ట్ ద్వారా వెబ్‌సైట్‌లు, సాఫ్ట్‌వేర్‌లను కోడింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కొత్త ఏఐ టూల్ చాలా స్మార్ట్‌గా పనిచేస్తుంది. కేవలం ఒకే ప్రాంప్ట్‌తో కోడ్‌ను రాసేయగలదు. వెబ్‌సైట్‌లను సాఫ్ట్‌వేర్‌లను సృష్టించగలదు. మీరు అడిగే ప్రతిదాన్ని చాలా చక్కగా పూర్తి చేయగలదు. ఈ ఏఐ డెవిన్ కేవలం మనుషులతో కలిసి పని చేయడానికి రూపొందించినట్టు వెల్లడించింది. మనుషులకు బదులుగా పనిచేసేందుకు ఈ ఏఐ టూల్ తీసుకురాలేదని స్పష్టంచేసింది. 'మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్‌ని ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉంది. బెంచ్ కోడింగ్ బెంచ్‌మార్క్‌లో డెవిన్ టూల్ అత్యాధునికమైనది. ప్రముఖ ఏఐ కంపెనీల నుంచి ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసింది. లో రియల్ జాబ్స్, సొంత షెల్, కోడ్ ఎడిటర్, వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి ఇంజినీరింగ్ పనులను పరిష్కరించే స్వయంప్రతిపత్త ఏజెంట్' అని కాగ్నిషన్ ఎక్స్ వేదికగా పేర్కొంది.
إرسال تعليق