హీరో విడా అడ్వాంటేజ్‌ ప్యాకేజీ పేరుతో  హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ మెయింటెనెన్స్‌తో పాటు సర్వీస్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పలు ప్రయోజనాలను వినియోగదారులకు కలుగజేస్తుంది. వినియోగదారులకు ఐదేళ్ల వ్యాలిడిటీతో విడా అడ్వాంటేజ్ ప్యాకేజీని అందజేస్తుంది. ఇది 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. స్కూటర్‌ మెయింటెనెన్స్‌, సర్వీస్‌ వంటివి కలిపి దాదాపు రూ. 27,000 విలువైన ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ప్యాకేజీ తీసుకోవాలనుకుంటే ఏప్రిల్ 31, 2024 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. పెట్రోల్‌ ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్న వారు ఒకేసారి ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారితే వాటి మెయింటెనెన్స్‌, పనితీరు విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాము వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందించేందుకు ఈ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ (ఈఎంబీయూ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ స్వదేశ్ శ్రీవాస్తవ అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడం అనేది కేవలం వాహనం కొనుగోలు మాత్రమే కాదని తాము అర్థం చేసుకున్నామన్నారు. విడా అడ్వాంటేజ్‌ ప్యాకేజీని ప్రారంభించిన కారణం కూడా ఇదేనన్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహన యాజమాన్యాన్ని పునర్నిర్వచించడమే కాకుండా పరిశ్రమలో కస్టమర్-కేంద్రీకృతతకు కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. వేగవంతమైన చార్జింగ్ కోసం దేశ వ్యాప్తంగా 2,000 కంటే ఎక్కువ చార్జింగ్ పాయింట్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా ఈ ప్యాకేజీ కలిగి ఉంది. విడా వర్క్‌షాప్‌లలో ఉచిత సేవతో పాటు ఉచిత నిర్వహణను అందిస్తుంది. ఒత్తిడి లేని 24*7 రోడ్‌సైడ్ సహాయం కూడా అందుతుంది. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మై విడా అనే మొబైల్‌ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీ ద్వారా వినియోగదారులకు తమ వాహన భద్రత, సౌలభ్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక ఈ ప్యాకేజీ ద్వారా కస్టమర్‌లు తమ వాహనం పనితీరు, భద్రతపై నిజ-సమయ అంతర్దృష్టులు కలిగి ఉండే అవకాశం ఉంది. నియంత్రణ కోసం ఈ యాప్ అనేక కనెక్టివిటీ, భద్రతా ఫీచర్‌లకు యాక్సెస్‌ ఇస్తుంది.

Post a Comment

أحدث أقدم