ప్రముఖ ఏఐ స్టార్టప్‌ ఓపెన్‌ ఏఐ వినూత్న ఆవిష్కరణకు తెరతీసింది. తమ ఏఐ మోడల్‌ సింథటిక్‌ ఆడియోను రూపొందించగలదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వాయిస్‌ ఇంజిన్‌ను ఆవిష్కరించింది. కేవలం 15 సెకన్ల ఒరిజినల్‌ వాయిస్‌ ఇన్‌పుట్‌ ద్వారా ఈ వాయిస్‌ ఇంజిన్ సింథటిక్‌ వాయిస్‌ను రూపొందించగలదని ఓపెన్‌ ఏఐ వెల్లడించింది. ఎమోషనల్‌ మరియు నిజమైన వాయిస్‌లను రూపొందించగలదని సంస్థ తెలిపింది. టెక్‌ సెక్టార్‌లో ఈ వాయిస్‌ ఇంజిన్‌ను సురక్షితమైన పద్ధతిలో అందుబాటులో ఉంచే మార్గాలను సంస్థ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఏఐ మోడల్‌ వాయిస్‌ ఇంజిన్‌ పనితీరు ఆధారంగా రీడింగ్‌ అసిస్టెంట్‌గా లేదా వాయిస్‌ ఓవర్‌ను రూపొందించడంలో ఉపయోగించవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఒక వ్యక్తి వాయిస్‌తో కంటెంట్‌ను అనేక భాషల్లోకి మార్చేందుకు కూడా ఈ ఫీచర్‌ ఉపయోగపడే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఓపెన్‌ ఏఐ వాయిస్‌ ఇంజిన్‌ ఫీచర్ల కారణంగా తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉండడంతో తన భాగస్వామ్య పక్షాలతో ఈ పరిస్థితులను గురించి చర్చించి వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతోపాటు ప్రభుత్వం, మీడియా, వినోదం, ఎడ్యుకేషన్‌, ప్రజలు సహా అమెరికా సహా ఇతర అంతర్జాతీయ భాగస్వామ్య పక్షాలతో ఈ అంశంపై మాట్లాడుతున్నట్లు ఓపెన్‌ ఏఐ పేర్కొంది. వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఓపెన్‌ఏఐ సంస్థ వెల్లడించింది. టెస్టింగ్ దశలో ఒరిజినల్ వాయిస్‌ ఇచ్చిన వ్యక్తి అనుమతి, వాటర్ మార్క్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలిపే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్న డేటా మరియు ఇతర అనుమతి పొందిన సమాచారం ఆధారంగా వాయిస్‌ ఇంజిన్‌కు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదని పేర్కొంది.


Post a Comment

أحدث أقدم