బీరు సీసాలు గ్రీన్ లేదా గోధుమ రంగులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా ఏళ్ల కిందట బీరును పారదర్శక సీసాలలో స్టోర్ చేసేవారట. అవి సూర్యరశ్మి తగిలినప్పుడు యువీ కిరణాలు బీర్ లోపల ఉన్న రసాయనాలని వేగంగా మార్చడాన్ని నిపుణులు గమనించారు. దానివలన బీర్ టెస్ట్ మారిపోయిందట !. దీంతో వారు బీర్ ను సూర్యరశ్మి నుంచి కాపాడడానికి కాంతిని చెదరగొట్టే వివిధ రంగులతో సీసాలను తయారు చేశారు. ఇలాంటి సమయంలోనే గ్రీన్, బ్రౌన్ కలర్ లో తయారు చేసిన సీసాల లోపలికి సూర్యరశ్మి ప్రవేశించలేక పోయిందట. మొదట బ్రౌన్ కలర్ బీర్ సీసాను తయారుచేసి అందులో బీరు స్టోర్ చేయడం మొదలు పెట్టారట. ఇక ఆ తర్వాత కాలంలో గ్రీన్ కలర్ సీసాలలో కూడా బీర్ ని స్టోర్ చేయడం మొదలు పెట్టారట !. ఇక ఈ రెండు కలర్స్ కి ఎక్కువ రెస్పాన్స్ రావడంతో అప్పటినుంచి ఈ రెండు కలర్స్ ఉన్న బీరు సీసాలలోనే బీరు పోసి స్టోర్ చేస్తూ ఉన్నారట!.
బీరు సీసాలకు గ్రీన్, బ్రౌన్ కలర్ లనే ఎందుకు వాడుతారు ?
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق