భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజులు 5 గంటలు 59 నిమిషాలు 16 సెకండ్లు పడుతుంది. ఇలా ఒక భ్రమణం పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పూర్తవుతుంది. మళ్లీ భ్రమణం మొదలైనపుడు ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు. అయితే గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఒకే విధంగా ఉండదు. కొన్ని గ్రహాలకు ఎక్కువ సమయం పడుతుంది, మరికొన్ని గ్రహాలకు తక్కువ సమయం పడుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు ఓ కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం కేవలం ఐదు రోజుల్లోనే నక్షత్రం చుట్టూ ఒకసారి భ్రమణం పూర్తి చేస్తున్నట్లు గుర్తించారు. అంటే ఈ గ్రహంలో ఒక సంవత్సరం అంటే మనకు ఐదు రోజులు అన్నమాట! సదరన్ క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు ఈ కొత్త గ్రహాన్ని గుర్తించారు. ఈ గ్రహం తన నక్షత్రానికి చాలా సమీపంగా ఉందని, అది ఆ నక్షత్రం చుట్టూ ఒకసారి తిరగడానికి ఐదు రోజులు పడుతోందని గుర్తించారు. గురు గ్రహం కన్నా మూడు రెట్లు పెద్దదైన ఈ కొత్త గ్రహం మన భూమికి దాదాపు 530 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలిపారు. ఇది వేగంగా తిరుగుతున్న మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోందని పేర్కొన్నారు. ఇది 1.95 బిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉందని అంచనా వేశారు. దీని ఉపరితల ఉష్ణోగ్రత 6,700 నుంచి 6,800 కెల్విన్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన వివరాలను ArXivలో ప్రచురించారు. అమెరికాలోని నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ అందజేసిన సమాచారాన్ని వినియోగించుకుని ఈ గ్రహాన్ని కనుగొన్నారు.
ఈ గ్రహం ఐదు రోజులకొకసారి నక్షత్రం చుట్టూ పరిభ్రమణం !
الأربعاء، 4 يناير 2023
nasa science STAR technologe ఈ గ్రహం ఐదు రోజులకొకసారి నక్షత్రం చుట్టూ పరిభ్రమణం
ليست هناك تعليقات:
إرسال تعليق