ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ 'ఓలా ఎలక్ట్రిక్' ఇటీవల నవరాత్రుల సమయంలో తమ ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన రూ.10,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మొదట్లో విజయదశమి వరకు మాత్రమే అని తెలిపింది, కాగా ఇప్పుడు ఆ ఆఫర్ ఇప్పుడు పొడిగించినట్లు కంపెనీ తెలిపింది.  ప్రస్తుతం రూ. 10,000 డిస్కౌంట్ రానున్న దీపావళి వరకు కొనసాగుతుందని తెలిపింది.  కస్టమర్ల నుంచి సానుకూలమైన స్పందన వస్తున్న కారణంగా ఈ ఆఫర్ కొనసాగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.40 వరకు ఉంది, కాగా కంపెనీ అందించిన ఈ రూ. 10,000 డిస్కౌంట్ వల్ల దీనిని కస్టమర్లు రూ. 1.30 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఓలా ఎస్1 ప్రో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 10,000 డిస్కౌంట్ తో పాటు ఇంకా అలాగే 5 సంవత్సరాల పొడిగించిన వారంటీపై రూ. 1,500 తగ్గింపు కూడా లభిస్తుంది. అంతే కాకుండా S1 ప్రో కోసం లోన్‌ తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి.ఈ ఓలా ఎస్1 ప్రో అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 3.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పవర్ ని పొందుతాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW మాక్సిమం పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

Post a Comment

أحدث أقدم