దేశీయ మార్కెట్లోకి నోయిస్  సంస్థ టీ డబ్ల్యూ ఎస్ నోయిస్ ఇంటెల్లి బడ్స్ ను లాంచ్ చేసింది. "Noise IntelliBuds" TWS అనేది భారతదేశపు మొట్టమొదటి AI న్యూరల్ నెట్‌తో ఆధారితం గెస్చర్ కంట్రోల్డ్‌ TWS అని కంపెనీ పేర్కొంది. ఈ బడ్స్ తల కదలికలను గుర్తించగలదు. ఈ సాంకేతికత వినియోగదారులు సంగీతాన్ని నియంత్రించడానికి మరియు తల కదలికల ద్వారా కాల్స్ కు సమాధానం ఇవ్వడానికి అనుమతిస్తుంది. Noise IntelliBuds ఒక సారి ఫుల్ ఛార్జ్ చేయడం ద్వారా 9 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌బడ్స్ 600mAh బ్యాటరీతో స్మార్ట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మరియు Instachargeకి కూడా మద్దతునిస్తుంది. నాయిస్ ఇంటెల్లిబడ్స్ రిటైల్ ధరను కంపెనీ రూ.4,999 గా నిర్ణయించింది. మరియు TWS బ్లాక్ మరియు వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది అని కంపెనీ పేర్కొంది. ఆసక్తి గల వినియోగదారులు అక్టోబర్ 14 నుండి GoNoise.comలో IntelliBudsని కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ వెల్లడించింది.

Post a Comment

أحدث أقدم