చనిపోయిన వారి వాయిస్‌తో మాట్లాడేలా సరికొత్త టెక్నాలజీ..!

الجمعة، 24 يونيو 2022

Amazon Alexa amzon Re:MARS 2022 science technologe చనిపోయిన వారి వాయిస్‌తో మాట్లాడేలా సరికొత్త టెక్నాలజీ..!

t f B! P L


ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలు డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెజాన్ అలెక్సా, అమెజాన్ ఏకో, గూగుల్ హోమ్ వంటివి ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. ఈ వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు వస్తున్న డివైజ్‌లు రోబో లాగా కాకుండా అచ్చం నిజమైన వ్యక్తిలా మాట్లాడుతూ ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ అలెక్సా (Amazon Alexa) అమితాబ్ బచ్చన్‌ వంటి పలువురు సెలబ్రిటీల వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ యూజర్లను ఫిదా చేస్తోంది. అయితే తాజాగా అలెక్సా సాధారణ వ్యక్తులను కూడా అనుకరించే ఫీచర్‌ను అప్‌డేట్ చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది. దీంతో యూజర్లు తమకు ఇష్టమైన వారి వాయిస్‌లో అలెక్సా మాటలను వినడం సాధ్యం అవుతుంది. చనిపోయిన వారి గొంతును కూడా అలెక్సా అనుకరించేలా అమెజాన్ కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టబోతోంది. ఇదెలా వర్క్ అవుతుంది? ప్రస్తుతం అమెజాన్ వాయిస్ టెక్నాలజీని వేరే లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఇందులో భాగంగా అలెక్సా చనిపోయిన వారి వాయిస్‌ను అచ్చు గుద్దినట్లు మిమిక్రీ చేసేలా ఒక అదిరిపోయే టెక్నాలజీని తీసుకొస్తోంది. ప్రియమైన వారి వాయిస్ లేదా చనిపోయినవారి వాయిస్‌ను ఒక నిమిషం కంటే తక్కువసేపు రికార్డ్ చేస్తే.. ఆ శాంపిల్‌ను అలెక్సా విని.. ఆ వాయిస్‌ను చాలా పర్ఫెక్ట్‌గా అనుకరిస్తుంది. తద్వారా యూజర్లు అలెక్సా నుంచి వినిపించే అన్ని మాటలను తమకు ఇష్టమైన వారి వాయిస్‌లో లేదా చనిపోయిన వారి స్వరంలో వినగలుగుతాయి. ఇలా వినడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పవచ్చు. అమెజాన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్ఫరెన్స్ Re:MARS 2022 లాస్ వెగాస్‌లో జూన్ 21 నుంచి జూన్ 24 వరకు జరిగింది. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా అమెజాన్‌ అలెక్సా ఏఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ ఒక డెమో ప్రదర్శించారు. ఈ డెమోలో అలెక్సా డివైజ్ చనిపోయిన వ్యక్తి వాయిస్‌ని అద్భుతంగా మిమిక్రీ చేసింది. ఈ డెమో ప్రదర్శించడానికి ఒక చిన్న పిల్లాడు, చనిపోయిన అతని అమ్మమ్మ వాయిస్ శాంపిల్‌ని అమెజాన్ ఉపయోగించింది. ఈ డెమోలో పిల్లాడు అమ్మమ్మ గొంతులో ది విజార్డ్ ఆఫ్ Oz వినిపించాలని అలెక్సాని కోరాడు. అప్పుడు, అలెక్సా "సరే" అని అమ్మమ్మ గొంతులో ఆ నవల చదివింది. మరణించిన వారి వాయిస్ మళ్లీ వింటుంటే ఒక స్వీట్ ఎక్స్‌పీరియన్స్ పొందినట్లు అవుతుందని ఇది అద్భుతమైన ఫీచర్లు అని పొగుడుతున్నారు. ప్రస్తుతానికి, అలెక్సా పరికరాల్లో అమెజాన్ ఈ ఫీచర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అనే దానిపై అధికారిక సమాచారం లేదు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ