రైలులో యువతిపై సామూహిక అత్యాచారం

Sunday, October 10, 2021

crime maharastra railway రైలులో యువతిపై సామూహిక అత్యాచారం

t f B! P L


కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా.. 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లఖ్‌నవూ నుంచి ముంబయికి వెళ్తున్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు. మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని ఇగత్‌పురి, కాసారా రైల్వేస్టేషన్‌ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు వేగం నెమ్మదించింది. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి ప్రవేశించారు. మారణాయుధాలను పట్టుకుని 10 నుంచి 20 మంది ప్రయాణికులను బెదిరించారు. వారి ఫోన్లు, నగలు, డబ్బులు లాక్కున్నారు. ఎదురుతిరిగిన ప్రయాణికులపై దాడి చేశారు. రైలులో ఉన్న ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు కాసారా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక.. ప్రయాణికులు సహాయం కోసం గట్టిగా అరిచారని ముంబయి రైల్వే పోలీసు కమిషనర్‌ కైసర్‌ ఖలీద్‌ ట్విటర్‌లో తెలిపారు. ఆ సమయంలో స్పందించిన పోలీసు సిబ్బంది.. దుండగుల్లో నలుగురిని పట్టుకున్నారని చెప్పారు. ''బాధితురాలిని వైద్య చికిత్స కోసం తరలించాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిందితులను మా బృందం ప్రశ్నిస్తోంది'' అని మరో ట్వీట్‌లో ఖలీద్‌ తెలిపారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ