బ్లాగ్‌ హౌస్ట్‌

السبت، 21 يوليو 2012

computer news

t f B! P L

బ్లాగ్‌లను మూడు అంచెలుగా రూపొందించవచ్చు. బ్లాగింగ్‌ క్లయింట్స్‌, బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫారమ్స్‌, బ్లాగ్‌ హౌస్ట్‌. బ్లాగ్‌ కూడా ఒక వెబ్‌ పేజీనే. దీనిలో వెబ్‌ పేజీలో లాగానే అనేకం అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

బ్లాగింగ్‌ క్లయింట్స్‌

బ్లాగింగ్‌ క్లయింట్స్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌గా లభిస్తాయి. బ్లాగ్‌.కాంలో ఆన్‌లైన్‌ బ్లాగ్‌లను తయారుచేసుకోవచ్చు. అన్ని ఫ్లాట్‌ఫారాలతో ఇది మిళితమై వుంటుంది. ప్లాక్‌లాంటివి బ్లాగ్‌ల్లో పోస్ట్‌ చేయడానికి ఆన్‌లైన్‌లో రూపొందించుకొనే వీలునిస్తాయి. ఇంటర్నెట్‌ను కనెక్ట్‌తో (ఆఫ్‌లైన్‌లో) పనిలేకుండా బ్లాగ్‌లో సమాచారాన్ని రూపొందించవచ్చు. పోస్టు చేయడానికి మాత్రమే ఇంటర్నెట్‌ను ఆన్‌ చేసుకోవాలి.

బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫారం
బ్లాగ్స్‌ను నిర్మించడానికి ఫ్లాట్‌ఫారమనేది కీలకం. బ్లాగ్‌కు సంబంధించిన విధి విధానాలను దీని ద్వారా చేయవలసి వుంటుంది. 


బ్లాగ్‌ హౌస్ట్‌
మనం తయారు చేసిన సమాచారాన్ని దీని ద్వారా హౌస్ట్‌ చేయవచ్చు.
ప్రధానంగా పై మూడు బ్లాగింగ్‌ ప్రధానమైనవి. అవి కాకుండా టెంప్లేట్స్‌, టెంప్లేట్స్‌లో మార్పులు, లేఅవుట్‌లో మార్పులు, కామెంట్స్‌, అప్‌లోడింగ్‌, ట్యాగింగ్‌ సెర్చ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్స్‌, పోస్టు చేసుకునేందుకు, కోడ్‌, బ్లాగ్‌ ట్రాకర్స్‌ కూడా వుండేటట్లు చూసుకోవాలి.

 

బ్లాగ్‌ టెంప్లేట్స్‌?

బ్లాగ్‌ ఎలా వుండాలో నిర్దేశించే నమూనా పేజీ. బ్లాగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌, ఫాంట్‌ టైప్‌, కలర్‌ డెఫినిషన్స్‌ అనుగుణంగా చూడవచ్చు. 



                               వెబ్‌క్యామ్‌                                             








నేడు కంప్యూటర్‌ వాడకం సర్వ సాధారణమైంది. దానితో పాటు ఇంటర్నెట్‌ వాడకం కూడా మన దేశంలో బాగా పెరిగిపోయింది. ఐడి కార్డులు, ట్రాఫిక్‌ నియంత్రణ, షాపులలో చోరీల నియంత్రణ.... ఇలా అనేక రకాలుగా ఈ వెబ్‌ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. దేశ, విదేశాలలో వున్న మన స్నేహితులతో డైరెక్ట్‌గా మాట్లాడే సౌకర్యం వుండటంతో వెబ్‌క్యామ్‌కు గిరాకీ పెరిగింది.
లో క్వాలిటీ ఫొటోలకు వాడే కెమెరా కాబట్టి దీనికి వెబ్‌ కెమెరా అనే పేరు వచ్చింది. వాస్తవంగా ఇది పిసికి కనెక్ట్‌ అయి వుంటుంది కాబట్టి పిసి కెమెరా అనవచ్చు. ఇది ఇంటర్నెట్‌కే పరిమితం కాకుండా స్టిల్‌ కెమెరా, చాటింగ్‌కి, కాన్ఫరెన్సింగ్‌, మెయిల్స్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
వెబ్‌క్యామ్‌ ద్వారా టివి ప్రసారాలను కూడా ఇతరులకు పంపే సౌకర్యం వుంది. మన సిస్టమ్‌లో టివి ట్యూనర్‌కార్డ్‌ వున్నట్లయితే మెసెంజర్‌లోని వెబ్‌క్యామ్‌ సోర్స్‌ను సెలెక్ట్‌ చేసి అవసరమైన టివి ప్రసారాలను ఇతరులకు పంపవచ్చు. బ్రాడ్‌బ్యాండ్‌ వేగాన్ని బట్టి టివి వీడియో కదలికలు వుంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలలో వెబ్‌క్యామ్‌లు అమర్చడం జరిగింది. వీటి ద్వారా ప్రత్యక్షంగా ఆ ప్రదేశాలల్లో ఏమి జరుగుతుందో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ఇవి లైవ్‌ వీడియోలుగా కూడా ఉపయోగపడుతున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ