ఆరు కొత్త రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేసిన వొడాఫోన్ ఐడియా

వొడాఫోన్ ఐడియా దేశీయ కస్టమర్ల కోసం ఆరు కొత్త రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేసింది. వీటి ధర రూ.179 నుంచి ప్రారంభమవుతుంది. టెల్కో కంపెనీలు కేవలం కాలింగ్ ప్లాన్లను కూడా అందించాలని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్లాన్లలో మొబైల్ డేటా లభించదు, కానీ మెసేజ్ సౌకర్యం ఉంటుంది. ఇవి సెగ్మెంట్‌లోనే అత్యంత చౌకైన ప్లాన్లని కంపెనీ చెబుతోంది. వేర్వేరు వ్యాలిడిటీలతో ఈ ప్లాన్లు వచ్చాయి. వీటిలో గరిష్ఠంగా 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కూడా ఉంది. రూ.179 రీఛార్జ్ ప్లాన్ లో  అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 25 రోజుల వ్యాలిడిటీ, అదనపు ప్రయోజనంగా Vi Movie & TV యాప్ యాక్సెస్, Vi రూ.185 రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 28 రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్ వుంటుంది. రూ.203 రీఛార్జ్ ప్లాన్ లో  అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 30 రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్, Vi రూ.206 రీఛార్జ్ ప్లాన్ ,అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, నెల రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్ వుంటుంది. రూ.470 రీఛార్జ్ ప్లాన్ లో  అన్‌లిమిటెడ్ కాలింగ్, 900 SMS, 84 రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్ వుంటుంది, Vi రూ.1849 రీఛార్జ్  ప్లాన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో కేవలం కాలింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్‌కు పూర్తి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే 3,600 SMS కూడా ఇస్తారు.

إرسال تعليق

أحدث أقدم
3