నిజం నిలకడగా తేలుతోంది. మొన్న ఓ పేపర్ కూడా క్షమాపణ చెప్పిందని మాజీ మంత్రి కొండా సురేఖ ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాపై చాలామంది తప్పుడు ఆరోపణలు చేశారు. క్షమాపణలు చెప్పేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. కొండా సురేఖ ఏం ట్వీట్ చేశారో ఇంకా చూడలేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ కొండా సురేఖట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో 'బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసిందని కొండా సురేఖ ట్వీట్ చేశారు.
నిజం నిలకడగా తేలుతోంది. మొన్న ఓ పేపర్ కూడా క్షమాపణ చెప్పింది : కొండా సురేఖ ఏం ట్వీట్ చేశారో ఇంకా చూడలేదు : కేటీఆర్
byTelugu Lo Computer
•
•
2 min read
