హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య భాగస్వామ్యం షాంఘై నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

చైనా లోని షాంఘై నగరంలో అక్టోబర్ 24, 25 తేదీలలో 10వ ప్రపంచ సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, లోక్ నాయక్ ఫౌండేషన్, వంశీ ఆర్ట్ థియేటర్స్, మలేసియా తెలుగు సంఘం సంస్థల సహకారంతో ఈవెంట్‌ను నిర్వహించారు. సదస్సులో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పంపిన అభినందన సందేశం విశేష ఆదరణ పొందింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్యోపన్యాసం, ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశిష్ట ప్రసంగం పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. చైనాలో ఇంత విస్తృత స్థాయిలో తెలుగు సాహిత్య సదస్సును నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. షాంఘైలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తరఫున కాన్సుల్స్ స్నేహజ జొన్నలగడ్డ, రోహిత్ కోగంటి గౌరవ అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా గడ్డపై ఇటువంటి ప్రతిష్ఠాత్మక తెలుగు సాహిత్య సదస్సు నిర్వహించబడడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన షాంఘై తెలుగు సంఘాన్ని అభినందించారు. నార్డ్ ఆంగ్లియా ఇంటర్నేషనల్ స్కూల్ తమ పాఠశాల ప్రాంగణాన్ని తెలుగు సింపోజియం నిర్వహణకు ఉదారంగా అందించినందుకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రిచర్డ్ థాంప్సన్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.

إرسال تعليق

أحدث أقدم
3