.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} లంచం తీసుకోవడంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత స్టైలేవేరు : స్కూటీ డిక్కీలో లంచం వేయించిన సునీత -LATEST NEWS AP TO TG లంచం తీసుకోవడంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత స్టైలేవేరు : స్కూటీ డిక్కీలో లంచం వేయించిన సునీత -LATEST NEWS AP TO TG
W T F

లంచం తీసుకోవడంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత స్టైలేవేరు : స్కూటీ డిక్కీలో లంచం వేయించిన సునీత

الثلاثاء، 6 أكتوبر 2026

Circle-33 (Mehdipatnam) She Had the Bribe Money Placed in Her Scooty’s Storage Compartment TelanganaGolconda Zone Town Planning Supervisor Sunitha’s Unique Style of Taking Bribes

t f B! P L

        
జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 (మెహిదీపట్నం) టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసీరామ్ సునీత లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే లంచం తీసుకోవడంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా లంచం సొమ్మును నేరుగా తీసుకునే విధానానికి భిన్నంగా తన స్కూటీ డిక్కీలో డబ్బులు వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చెప్పినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. సునీత ట్రాప్ కేసులో ఏసీబీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. లంచం సొమ్మును నేరుగా చేతికి తీసుకోకుండా బైక్ లేదా స్కూటీ డిక్కీలో డబ్బులు పెట్టించి వెళ్లాలని ఆమె షరతు విధించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఓ పని కోసం రూ.4 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లంచం సొమ్ము తీసుకునేందుకు టెలిఫోన్ భవన్ వద్ద సునీత వేచి ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు మాటువేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలను సునీత తన బైక్ డిక్కీలో వేయించుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. రూ.4 లక్షలు ఇచ్చేందుకు వచ్చిన బాధితుడిని కూడా డబ్బును నేరుగా తనకు ఇవ్వకుండా స్కూటీ డిక్కీలో వేయాలని సునీత చెప్పినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. బాధితుడు డబ్బును డిక్కీలో పెట్టిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. లంచం సొమ్ము డిక్కీలో ఉండగానే సునీతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ట్రాప్ అనంతరం సునీత తాను డబ్బును నేరుగా తీసుకోలేదని వాదించినట్లు తెలుస్తోంది. అయితే డిక్కీలో నగదు పెట్టించడమే లంచం స్వీకరణలో భాగమా? అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. సునీత గతంలోనూ ఇదే తరహాలో లంచం సొమ్మును తన స్కూటీ డిక్కీలో వేయించుకునేదని ఏసీబీ విచారణలో సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పలు వ్యవహారాల్లో రావాల్సిన డబ్బును నేరుగా చేతికి తీసుకోకుండా డిక్కీలో వేయించే విధానాన్ని అనుసరించినట్లు అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. లంచం తీసుకునే విధానాన్ని కూడా పక్కాగా మార్చుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. డబ్బు తీసుకున్నట్లు ప్రత్యక్షంగా కనిపించకుండా డిక్కీలో నగదు పెట్టించుకుని అక్కడి నుంచి వెళ్లేలా చేయడం వెనుక ఉద్దేశమేంటన్న దానిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రాప్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సునీతతో గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, లంచం డిమాండ్‌కు సంబంధించిన వ్యవహారాలు, డిక్కీలో నగదు పెట్టిన ఘటనలపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

tag

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ