ఉక్రెయిన్‌లోని డ్నిప్రో రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు గురువారం వెల్లడించారు. ప్లాట్‌ఫారమ్‌పై రైలు నిలిచి ఉన్న సమయంలో ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. డ్నిప్రో నుంచి జపోరిజియా వెళ్లాల్సిన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ రైలు ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అప్పటికే ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దాడిలో 13 మంది అక్కడికక్కడే మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ టీమ్‌లు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్నిప్రో స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడికి సంబంధించి ఉక్రెయిన్ రైల్వేస్ తమ టెలిగ్రామ్ ఖాతాలో కీలక వివరాలను వెల్లడించింది. జెట్ ఆధారిత డ్రోన్ తో రష్యా ఈ దాడికి పాల్పడిందని పేర్కొంది. ''డ్నిప్రో నుంచి జపోరిజియా వెళ్లాల్సిన రైలు నంబర్ 866 ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న సమయంలో రష్యా ఈ డ్రోన్ దాడి జరిపింది... తీవ్ర ముప్పు ఉంది అని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అప్పటికే ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు'' అని వెల్లడించిది. ఈ భయానక దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. రష్యాపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి : 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
byTelugu Lo Computer
•
•
2 min read
