ఆగ్రో ప్రొడక్ట్స్ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీ న్యాచురైట్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ తెచ్చింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 1:2 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించగా తాజాగా అందుకు సంబంధించిన రికార్డ్ తేదీని ఖరారు చేసినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 25న రికార్డ్ తేదీ నిర్ణయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. ఆలోపు ఈ కంపెనీలో షేర్లు కొన్నవారి డీమ్యాట్ ఖాతాలో షేర్ల సంఖ్య రెట్టింపు కానుంది. 1 కొంటే 2, 100 కొంటే 200 షేర్లు వస్తాయి. మరోవైపు.. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 45 శాతం నష్టపోయింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత ఈ షేరు ప్రస్తుత ధర రూ.186 నుంచి రూ. 93 స్థాయికి దిగిరానుంది. కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ ప్రకారం కొద్ది రోజుల క్రితం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీస్ యాక్ట్ 2013, సెక్షన్ 61 ప్రకారం 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేసేందుకు ఆమోదం లభించింది. దీని అర్థం రూ.10 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరును రూ.5 ఫేస్ వాల్యూ ఉండేలా 2 షేర్లుగా విభజించనున్నారు. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డ్ తేదీని సెప్టెంబర్ 25, 2026గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్‌లో న్యాచురైట్ ఆగ్రో ప్రొడక్ట్స్ కంపెనీ షేరు 3.7 శాతం లాభంతో రూ.193.50 వద్ద ముగియగా ఈరోజు మాత్రం నష్టాల్లోకి జారుకుంది. ఈ వార్త రాసే సమయానికి 1.82 శాతం నష్టంతో రూ.186 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 4 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో ఫ్లాట్‌గా కొనసాగుతోంది. గడిచిన ఆరు నెలల్లో 15 శాతం లాభపడింది. గత ఏడాది కాలంలో 45 శాతం నష్టపోయింది. ఇక లిస్టింగ్ అయిన మూడున్నర నెలల్లో ఈ స్టాక్ దాదాపు 100 శాతం లాభపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.363 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.121 వద్ద ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.98.51 కోట్లుగా ఉంది.
స్టాక్ స్ప్లిట్ ప్రకటించిన న్యాచురైట్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق